ప్రధాని నరేంద్ర మోదీని 'ఫేక్ స్ట్రాంగ్ మ్యాన్' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియో విడుదల చేయడంపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా విదేశాంగ వ్యవహారాల(భారత్-చైనా సరిహద్దు వివాదం)పై రాజకీయం చేసేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతల్ని రాహుల్ గాంధీకి మరోమారు అప్పగించేందుకు వీడియోల ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నమూ విఫలమైందని ఎద్దేవా చేశారు నడ్డా.
"డోక్లాం, తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ సరిహద్దు ఘర్షణ విషయంలోనూ రాహుల్ గాంధీ... చైనా బలాన్ని నమ్ముతున్నారే గానీ, భారత సాయుధ దళాలను విశ్వసించడం లేదు. నిజానికి ఈ రాజవంశం (గాంధీల కుటుంబం) బలహీనమైన భారతదేశాన్ని, బలమైన చైనాను కోరుకుంటోంది. ఎందుకు?"
- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
మోదీ బలమైన వ్యక్తి అన్నది ఓ కల్పితం
ప్రధాని మోదీ బలమైన వ్యక్తి అన్నది ఓ కల్పితమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
"ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేందుకు తనను తాను బలమైన వ్యక్తిగా చిత్రీకరించుకున్నారు. ఇప్పుడు ఇదే దేశానికి అతిపెద్ద బలహీనతగా మారింది. ప్రస్తుతం భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మోదీ తన 56 అంగుళాల ఛాతీ సిద్ధాంతాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మోదీని దెబ్బతీసేందుకే!