21 రోజుల లాక్డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాలని భాజపా నిర్ణయించింది. ఇందు కోసం తమ కోటి మంది పార్టీ కార్యకర్తలు.. ఒక్కొక్కరు ఐదుగురు పేదలకు చొప్పున భోజనం అందిస్తారని పేర్కొంది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పార్టీ బేరర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
"పార్టీ నాయకులు, కార్యకర్తలు... ఒక్కొక్కరు ఐదుగురు పేదలకు భోజనం అందించాలి."
- జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు
పేదలకు భోజనం అందించే విషయమై త్వరలోనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ మీడియా విభాగం హెడ్ అనిల్ బలూనీ తెలిపారు.
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని లాక్డౌన్ చేసింది. దీనితో పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లలేక, ఉన్నచోట పని దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు భాజపా ముందుకొచ్చింది.
ఇదీ చూడండి:రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ