ఫిబ్రవరి 14 అంటే టక్కున గుర్తొచ్చేది ప్రేమికుల దినోత్సవం.. కానీ గుజరాత్ సూరత్‌లో ఇలా కాదు. అక్కడ అదే రోజున ప్రతి పాఠశాలలో విద్యార్థులు.. తల్లిదండ్రులను పూజించే ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను గుర్తు చేసేలా.. మాతృ పితృ పూజన్ దివస్ (తల్లిదండ్రుల పూజోత్సవం) జరపనున్నట్లు స్పష్టం చేశారు జిల్లా విద్యాశాఖాధికారి. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో కొన్ని మార్గదర్శకాలు కూడా అందించారు. ఆయా పాఠశాలల్లో 5 నుంచి 10 తల్లిదండ్రుల జంటలను ఆహ్వానించి.. వారి పిల్లలతో సత్కరించాలని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు కార్పొరేటర్, పాఠశాల కమిటీ సభ్యులు, సామాజిక కార్యకర్తలు వంటి ప్రత్యేక అతిథులను ఆహ్వానించవచ్చన్నారు. ఆ రోజు ప్రత్యేకతనూ చాటి చెప్పే విధంగా ప్రసంగాలు ఉండాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
అవగాహన పెంపొందించాలి...