చిన్నారుల అక్రమ నిర్బంధం, అత్యాచార కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బిడాది ఆశ్రమవాసి, స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద ఆచూకీ అంతుచిక్కడం లేదు. ఆయన ఆశ్రమ నిర్వాహకులూ కనిపించని నేపథ్యంలో నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే నిత్యానంద ఓ కొత్త హిందూ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈక్వెడార్ సమీపంలోని ఈ ద్వీపదేశానికి 'కైలాస' అనే పేరు కూడా పెట్టారట. అంతేకాదు ప్రత్యేక జెండాతో పాటు మంత్రి వర్గం కూడా ఉందని సమాచారం. ఈ హిందూ దేశానికి 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కైలాస.ఓఆర్జీ'అనే వెబ్సైట్ కూడా ఉంది.
ఆంగ్లం, సంస్కృతం, తమిళం ప్రధాన భాషలు
ఈ దేశానికి 'రిషభ ధ్వజ'గా పిలిచే పరమ శివుడు, నంది చిహ్నాలతో కూడిన ప్రత్యేక జెండా ఉంది. ఆంగ్లం, సంస్కృతం, తమిళం ఈ దేశ ప్రధాన భాషలుగా ఉన్నాయి. కొత్త దేశ ప్రభుత్వంలో హోంశాఖ, రక్షణ, ఖజానా, వాణిజ్య, గృహ నిర్మాణ, మానవ వనరులు, విద్యా శాఖలు ఉన్నాయి.
ఒక్క క్లూ కూడా లేదు..