అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగేంతవరకు పోరాడతామని పునరుద్ఘాటించారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. ముంబయిలో జరిగిన శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఠాక్రే... రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
'రావణుడిని రాముడు చంపిన రోజున(దసరా) కోర్టులకు సేలవుంటుంది. రావణుడిని చంపి రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజునా(దీపావళి) కోర్టులకు సెలవుంటుంది. కానీ రాముని జన్మస్థలం అయోధ్య అనడంలో సందేహాలుంటున్నాయి. ఈ సమస్యపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలన్నదే మా డిమాండ్.'
-- ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధ్యక్షుడు.
త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధిపొందడానికి రామమందిర సమస్యను లెవనెత్తడం లేదని స్పష్టం చేశారు ఠాక్రే.