2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్.. హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. భాజపా పార్టీ అతనికి టికెట్ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
హరియాణాకే చెందిన దత్... భాజపా రాష్ట్ర విభాగ అధ్యక్షుడు సుభాష్ బారాలతో భేటీ కావడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతం హరియాణా పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న యోగేశ్వర్... ఆ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. త్వరలోనే యోగేశ్వర్కాషాయ కండువా కప్పుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాడీ కుస్తీ వీరుడు. 2013లో పద్మశ్రీ పురస్కారం వరించింది.
అక్టోబర్ 21న ఎన్నికలు...