తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శత'కొట్టిన ఎయిర్​ఫోర్స్​ విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ - ఎయిర్​చీఫ్ మార్షల్

భారత వాయుసేన విశ్రాంత పైలట్ స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియా మంగళవారం వందో జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎయిర్​ఛీఫ్ మార్షల్ భదౌరియా.. మజితియాకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారత వాయుసేన ట్విట్టర్​లో ప్రత్యేక వీడియో షేర్ చేసింది.

Oldest living IAF fighter pilot turns 100, Air chief extends greetings
ఎయిర్ ఫోర్స్

By

Published : Jul 28, 2020, 10:04 AM IST

భారత వాయుసేన విశ్రాంత పైలట్ స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియా మంగళవారం వందో పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మజితియాకు ఎయిర్​చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం స్వాతంత్య్రం సంపాదించిన 1947 ఆగస్టులో ఆయన రిటైర్ అయ్యారు. సుదీర్ఘ కాలం జీవించి ఉన్నభారత వాయుసేన విశ్రాంత పైలట్​ మజితియానే కావడం గమనార్హం.

ఆయన పుట్టినరోజు సందర్భంగా భారత వాయుసేన తన ట్విట్టర్ హ్యాండిల్​లో ప్రత్యేక వీడియో పోస్టు చేసింది. వాయుసేన యోధుల తరఫున మజితియాకు వాయుసేనాధిపతి మార్షల్ భదౌరియా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొంది.

"100వ పుట్టినరోజు సందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియాకు భారత వాయుసేన తరపున శుభాకాంక్షలు. ఆగస్టు 1947లో ఆయన రిటైర్ అయ్యారు. అత్యధిక వయసు కలిగి ఉన్న ఎయిర్​ఫోర్స్ యుద్ధ విమాన పైలట్​గా పేరుగాంచారు."

-భారత వాయు సేన ట్వీట్

ఇదీ చదవండి-చైనా సరిహద్దుల్లో అమెరికా యుద్ధ విమానాలు

ABOUT THE AUTHOR

...view details