తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి - పురాతత్వ శాఖ

తమిళనాడు శివగంగై జిల్లా కీళాదిలో పురాతత్వ శాఖ జరుపుతోన్న తవ్వకాల్లో నాలుగు అడుగుల ఇటుక బావి బయటపడింది.

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి

By

Published : Aug 1, 2019, 6:01 AM IST

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి

తమిళనాడులో జరుగుతున్న పురాతత్వ శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఓ పురాతన బావి బయటపడింది. శివగంగై జిల్లా మధురై సమీపంలోని కీళాదిలో జరుగుతున్న ఐదో దఫా తవ్వకాల్లో 4 అడుగుల ఇటుక బావిని కనుగొంది పురావస్తు శాఖ.

నాలుగు పొరలు ఉన్న ఈ పురాతన కట్టడం.. ఈ నెలలోనే బయటపడిన మరో బావిని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

కీళాదిలో అయిదో దశ తవ్వకాలు జూన్​ 13న ప్రారంభించారు. ఈ తవ్వకాల్లో ఇప్పటివరకు వేలకొద్ది వస్తువులు బయటపడ్డాయి. తమిళనాడు భాష, సాంస్కృతిక, పురాతత్వ శాఖ మంత్రి కె.పాండియ రాజన్​ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: 75 ఏళ్లు పైబడిన వారికి భోజనం ఉచితం

ABOUT THE AUTHOR

...view details