వలస కూలీల కోసం దేశవ్యాప్తంగా 50 వేల అద్దె ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కోరింది పెట్రోలియం శాఖ. లాక్డౌన్లో లక్షలాది మంది శ్రమజీవులు నగరాలు వదిలి స్వగ్రామాలకు తరలివెళ్లిన నేపథ్యంలో... వారికి చౌకగా అద్దె ఇళ్లు ఇప్పించే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేసింది.
వలస కూలీల కోసం ఇళ్ల నిర్మాణంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), జీఏఐఎల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) సంస్థల ప్రతినిధులతో ఇటీవలే సమావేశం నిర్వహించింది చమురు శాఖ. గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఇళ్ల నిర్మాణ పథకం ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించింది.