తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ దాడిని ముందుగా గుర్తించింది వారే... - రాజౌరీ

భారత్​- పాక్​ మధ్య గత నెల 27న రజౌరీలో జరిగిన వైమానిక పోరాటంలో స్థానిక గ్రామస్థుల పాత్ర మరువలేనిదని అధికారులు తెలిపారు. ఆకాశం నుంచి ఏదో పడిందని సమాచారం ఇవ్వగా పాక్​ దాడిని గుర్తించామన్నారు.

పాక్​ దడి చేసిన రోజుల భుదల్​ గ్రామస్థుల పాత్ర ఎనలేనిదని ఆర్మీ అధికారులు ప్రశంసించారు.

By

Published : Mar 9, 2019, 9:14 AM IST

భారత్​-పాక్​ మధ్య వైమానికి పోరాటంలో జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లా భుదల్​ మండలంలోని గ్రామస్థుల పాత్ర మరువలేనిదని సరిహద్దు రక్షణ దళం అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 27న రాజౌరీ ప్రాంతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆకాశం నుంచి ఏదో పడి... మాలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని... జమ్ముకశ్మీర్​ పీర్​ పంజల్​ శ్రేణిలో విధుల్లో ఉన్న ఆర్మీ అధికారికి సమాచారం అందించారు అక్కడి నివాసితులు. భారత్​పై దాడికి పాకిస్థాన్​ ఎఫ్​-16 యుద్ధ విమానాలను ప్రయోగించిందన్న అనుమానాలకు గ్రామస్థులిచ్చిన సమాచారం బలపరించిందని అధికారులు స్పష్టం చేశారు.

11 బాంబులు ప్రయోగించిన పాక్​

రాజౌరి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుదల్​ మండలంలో 51 గ్రామాలున్నాయి. పాకిస్థాన్​ వైమానికి దాడికి యత్నించినప్పటి నుంచి ఈ గ్రామాలే భారత నిఘా సంస్థలకు ప్రధాన సమాచార కేంద్రాలుగా మారాయని అధికారులు పేర్కొన్నారు. రాజౌరి ప్రాంతంలోని 6 మిలటరీ శిబిరాలే ప్రధాన లక్ష్యంగా పాకిస్థాన్​ 11 బాంబులను ప్రయోగించిందని తెలిపారు

ఎఫ్​-16 నుంచే ప్రయోగించగల క్షిపణులు

భుదల్​ మండలంలో లభ్యమైన శకలాలు కేవలం ఎఫ్​-16 నుంచే ప్రయోగించటానికి వీలుపడే క్షిపణులుగా గుర్తించామని అధికారులు తెలిపారు.

సమాచార గోప్యత

పాక్​ వైమానిక దాడిలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారత్​పై దాడికి పాక్​ ఎఫ్​-16 విమానాల వినియోగంపై అమెరికాకు వివరాలు అందించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details