ఆర్టికల్ 370 రద్దు అనంతరం భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కశ్మీర్ నేతలను గృహ నిర్బంధంలో ఉంచింది కేంద్రం. ఇటీవల పలువురు నేతలను విడుదల చేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై తాజాగా ప్రజా భద్రత చట్టాన్ని ప్రయోగించింది. పలువురు నేతలను విడుదల చేసి మాజీ ముఖ్యమంత్రులపై పీఎస్‌ఏను ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది.
ఒమర్, మెహబూబాపై ప్రజా భద్రత చట్టం - profiles of omar abdulla
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాపై కఠినమైన ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద కేసులు నమోదయ్యాయి. ఇటీవల పలువురు నేతలను గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన అధికారులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులపై మాత్రం పీఎస్‌ఏను ప్రయోగించడం చర్చనీయాంశమైంది.
మెహబూబా, ఒమర్‌పై ప్రజా భద్రత చట్టం
గత ఏడాది ఆగస్టు 5న జమ్మూ-కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్, మెహబూబా సహా అనేక మంది నేతలు గృహ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్, మెహబూబాలపై పీఎస్‌ఏను ప్రయోగించారు.
ఇదీ చూడండి: 'ట్రంప్ భారత పర్యటన చర్చల దశలోనే ఉంది'
Last Updated : Feb 29, 2020, 11:49 AM IST