తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆంగ్లేయుల గడ్డపై 'భారత్​ భేరి'

సార్వత్రిక సమర శంఖారావం... విదేశంలో ప్రతిధ్వనించింది. భాజపా, కాంగ్రెస్​ నిర్వహించిన పోటాపోటీ ప్రచారాలతో బ్రిటన్​​ మార్మోగింది.

ఆంగ్లేయుల గడ్డపై 'భారత్​ భేరి'

By

Published : Mar 17, 2019, 7:38 PM IST

లోక్​సభ ఎన్నికలకు... ప్రధాన పార్టీల ఎన్నారై శాఖలు విదేశాల్లో ప్రచారం ముమ్మరం చేశాయి. 'ఓవర్సీస్​ ఫ్రెండ్స్​ ఆఫ్​ బీజేపీ'(ఓఎఫ్​బీజేపీ) ఆధ్వర్యంలో లండన్​, బర్మింగ్​హామ్​, మాంచెస్టర్​, ఎడిన్​బరో నగరాల్లో కార్ల ర్యాలీ చేపట్టారు. తర్వాత జరిగిన సభకు బ్రిటన్​ కన్జర్వేటివ్​ ఎంపీ బాబ్​ బ్లాక్​మాన్​ హాజరయ్యారు.

"యూకేలో దాదాపు 10వేల మంది ఎన్నారైలు ఉన్నారు. వీరందరూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొంటారు. భాజపా గెలుపే ధ్యేయంగా 'టీమ్​ మోదీ' పేరుతో ఇక్కడ ప్రచారం చేస్తున్నాం."
-కుల్​దీప్​ షెకావత్, ఓఎఫ్​బీజేపీ అధ్యక్షుడు.

ఇండియన్​ ఓవర్సీస్​ కాంగ్రెస్​(ఐఓసీ) తూర్పు లండన్​లోని బర్మింగ్​హామ్​, కోవెంట్రీ పట్టణాల్లో 'ఓట్​ ఫర్​ కాంగ్రెస్'​ నినాదంతో కార్ల ర్యాలీ చేపట్టింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details