ప్రస్తుతం అమ్మాయి ్యఅయినా, అబ్బాయి అయినా.. నచ్చిన వారితో డేటింగ్ చేయడానికి ఎంచుకుంటున్న పద్దతి ఆన్లైన్. ప్రధానంగా ఇందుకు సంబంధించిన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో కోకొల్లలుగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలోనే లాక్డౌన్ వేళ.. వీటి వినియోగంపై నిర్వహించిన ఓ అంతర్గత సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆన్లైన్ డేటింగ్‌కు ప్రఖ్యాతి గాంచిన 'క్వాక్‌క్వాక్' యాప్ అందించిన నివేదిక ప్రకారం.. 100లో 35 ప్రొఫైల్స్‌కు పురుషులు లైక్ కొడుతుండగా.. మగిలిన 65 ప్రొఫైల్స్‌ను స్కిప్ చేస్తున్నారట. అదే మహిళలైతే ..కేవలం 4 ప్రొఫైల్స్నే ఇష్టపడుతున్నారు. మిగిలిన 96డీపీలను స్కిప్ చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది.
ఫొటోల అప్‌లోడ్‌లో భయాందోళన..
చాటింగ్ విషయానికొస్తే.. పురుషులు సగటున 10మందితో సంభాషిస్తుంటే.. మహిళలు 25మందితో ముచ్చట్లు పెడుతున్నట్లు పేర్కొంది సర్వే. అంతేకాకుండా.. 60 శాతం మంది ప్రొఫైల్‌ను క్రియేట్ చేసే సమయంలోనే వారి ఫొటోలను కూడా అప్లోడ్ చేస్తున్నారు. మిగిలిన 40 శాతం.. ఈ విషయంలో భయాందోళనకు గురవుతున్నట్టు స్పష్టం చేసింది.