తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 19,218 మందికి కరోనా

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రోజూ అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 19,218 మందికి పాజిటివ్​గా తేలింది. ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీలోనూ కేసులు గణనీయంగా పెరిగాయి.

Odisha's COVID-19 tally jumps to 1,16,678 with over 3,200 fresh cases
తమిళనాట మరో 5,976 మందికి కరోనా

By

Published : Sep 4, 2020, 8:11 PM IST

Updated : Sep 4, 2020, 9:39 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మహారాష్ట్రలో కొవిడ్..​ రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 19,218 మందికి వైరస్​ సోకింది. మరో 378 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షల 63వేలు దాటగా... 25,964 మంది మరణించారు.

కర్ణాటకలో కొత్తగా 9 వేల 280 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,79,486కు చేరగా.. మృతుల సంఖ్య 6,170కి పెరిగింది.

తమిళనాడులో రోజూ స్థిరంగా 6 వేల కేసులు బయటపడుతున్నాయి. తాజాగా 5,976 మంది కరోనా బారినపడగా... 6,334 మంది రికవరీ అయ్యారు. మరో 79 మంది చనిపోయారు. ఇప్పటివరకు 3 లక్షల 92 వేల మందికి వైరస్​ నయమైంది. మరో 51,633 మంది చికిత్స పొందుతున్నారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 3,762 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 71 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 53 వేలు దాటింది.
  • ఒడిశాలో కొత్తగా 3,267 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 1,16,678కి చేరింది. 531 మంది మహమ్మారికి బలయ్యారు.
  • దిల్లీలో తాజాగా 2,914 కరోనా కేసులు వెలుగుచూశాయి. గడచిన 69 రోజుల్లో ఇవే అత్యధిక కేసులని అధికారులు తెలిపారు. వీరితో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1.85 లక్షలకు చేరింది. ఫలితంగా 4,513 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కేరళలో మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా 2,479 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా 18,800 యాక్టివ్​ కేసులు ఉండగా... 58,498 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
  • గుజరాత్​లో మరో 1,320 మందికి కరోనా సోకగా.. 14 మంది మృతి చెందారు.
  • జమ్ముకశ్మీర్​లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,047 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 755 మంది మృతి చెందారు.
Last Updated : Sep 4, 2020, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details