తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొసలిని చంపి.. మాంసాన్ని పంచిపెట్టి! - 10 అడుగుల మొసలి

ఒడిశాలోని కల్డపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు.. ఓ మొసలిని చంపారు. దాని మాంసాన్ని వండుకునేందుకు గ్రామస్థులకు పంచిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Odisha villagers kill crocodile, distribute meat
మొసలిని చంపి.. మాంసాన్ని పంచిపెట్టి!

By

Published : Jul 2, 2020, 8:21 PM IST

10 అడుగుల మొసలిని కొందరు యువకులు చంపిన ఘటన ఒడిశాలోని కల్డపల్లి గ్రామంలో జరిగింది. అనంతరం వంట కోసం ఆ మొసలి మాంసాన్ని గ్రామ ప్రజలకు పంచిపెట్టారు.

మొసలిని తాళ్లతో కడుతూ

చెట్టుకు కట్టేసి...

ఒడిశా మల్కన్​గిరి జిల్లాలోని పడియా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కల్డపల్లికి చెందిన యువకులు గ్రామ సమీపంలోని నదిలో 10 అడుగుల మొసలిని గుర్తించారు. దాన్ని తీసుకొచ్చి గ్రామంలోని ఓ చెట్టుకు వేలాడదీశారు. అనంతరం దాని మాంసాన్ని గ్రామస్థులకు పంచిపెట్టారు.

చెట్టుకు వేలాడదీసి

ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్​ మిరాసి తెలిపారు.

మొసలిని చంపిన యువకులు.. వంటకు మాంసం పంపిణీ

ఇదీ చూడండి:-బావిలో విషవాయువు.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details