తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ కరోనా: 15 రోజుల్లో 2 ఆస్పత్రుల నిర్మాణం - odisha corona hospitals

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వైరస్​ బాధితులకు చికిత్స అందించేందుకు రెండు ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు ప్రైవేట్​ ఆస్పత్రుల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంది నవీన్​ పట్నాయక్​ సర్కార్​.

Odisha to set up two special COVID-19 hospitals with total capacity of 950 beds
కరోనా చికిత్స కోసం రెండు ఆస్పత్రులతో ఒప్పందం

By

Published : Mar 26, 2020, 8:41 PM IST

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్​ సోకిన రోగులకు చికిత్స అందించేందుకు 950 పడకల సామర్థ్యం కలిగిన రెండు ప్రైవేట్​ ఆస్పత్రులతో గురువారం కీలక ఒప్పందం చేసుకుంది. చికిత్స అందించేందుకు భువనేశ్వర్​కు చెందిన కేఐఐఎంఎస్​, ఎస్​యూఎం ఆస్పత్రులు ఏప్రిల్​ 15లోపు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు.

కరోనా బాధితులకు అత్యాధునిక వైద్యం అందించేలా ఆస్పత్రులు ఉండాలని ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్ ఆదేశించారు. ఒడిశా మైనింగ్​ కార్పొరేషన్​, మహానంది కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్​ అందజేసిన సీఎస్​ఆర్​ నిధులతో ప్రభుత్వం ప్రైవేట్​ ఆస్పత్రులతో ఈ ఒప్పందం కుదుర్చకుంది.

ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది నవీన్​ పట్నాయక్​ సర్కార్​.

ABOUT THE AUTHOR

...view details