తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షీ బృందాలపై ఒడిశా ఎస్పీ గీతం - SHE TEAMS

మహిళల రక్షణకు షీ టీమ్ ఏర్పాటు చేశారు ఒడిశా గజపతి జిల్లా ఎస్పీ సారా శర్మ. త్వరలో పూర్తిస్తాయి కార్యకలాపాలు సాగించనున్న ఈ షీ టీమ్ చిహ్నాన్ని, గీతాన్ని విడుదల చేశారు ఎస్పీ.

షీ బృందాలపై ఒడిశా ఎస్పీ గీతం

By

Published : Jun 27, 2019, 7:40 AM IST

షీ బృందాలపై ఒడిశా ఎస్పీ గీతం

మహిళల రక్షణకు షీ టీమ్​ల ఏర్పాటు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. ఇలాంటి కార్యక్రమమే ఒడిశాలోని గజపతి జిల్లా ఎస్పీ సారా శర్మ ఏర్పాటు చేశారు. అంతే కాదండోయ్ షీ టీమ్​లకు ప్రచారం కల్పించేందుకు ఓ పాట తయారు చేసి విడుదల చేశారు. ఈ గీతాన్ని స్వయంగా ఎస్పీ సారానే ఆలపించారు.

ఈ షీ టీమ్ గీతం మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ధైర్యసాహసాలను నింపుతుందన్నారు ఎస్పీ సారా శర్మ. రాత్రుళ్లలో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆకతాయిల ఆగడాలతో అభద్రతా భావం నెలకొందన్న యువతుల వినతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు శర్మ. యువతులతో పలు దఫాలు చర్చించిన అనంతరం షీ టీమ్​లకు రూపకల్పన చేశామని వివరించారు.

ఎస్పీ సారా శర్మ ఏర్పాటు చేసిన షీ టీమ్​లో ఓ మహిళా ఎస్సై నేతృత్వంలోని పోలీసు సిబ్బంది జిల్లాలోని వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అమ్మాయిలను అల్లరి పెట్టే కేసులపై కఠినంగా వ్యవహరించనున్నారు. యువతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఓ నెంబర్​నూ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

ఈ గజపతి జిల్లా షీ టీమ్ మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సమాజంలో షీ టీమ్ పట్ల అవగాహన పెంచేందుకు చిహ్నాన్ని, గీతాన్ని విడుదల చేశారు.

ఇదీ చూడండి: వైరల్​: అసలు చిరుత ఇలా ప్రవరిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details