తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అద్భుత బాలుడి పలుకే సంగీతమాయెనే!

ప్రతి మనిషిలోనూ ఏదో ఓ కళ దాగి ఉంటుంది. గుర్తించేదాకా వజ్రం కూడా ఒట్టి రాయే.. అలాగే, ఈ బాలుడి ప్రతిభ కూడా. నోటితోనే నేపథ్య సంగీతాన్ని సృష్టిస్తాడు. పక్షుల కిలకిలరావాలూ పలికిస్తాడు. ఇక తన నోటి వెంట జాలువారే పాటలకు శ్రోతలంతా ముగ్ధులవుతున్నారు.

అద్భుత బాలుడి పలుకే సంగీతమాయెనే!

By

Published : Oct 4, 2019, 6:02 AM IST


ఒడిశా సంబల్​పుర్​లోని సపలహార గ్రామానికి చెందిన ప్రకాశ్​ అనే యువకుడు అంధుడే అయినా.. సంగీత వాద్యాలను అద్భుతంగా వాయిస్తాడు. చేత్తో వాయించడమే కాదు నోటితోనూ అచ్చం అవే శబ్దాలు చేస్తూ సంగీతాన్ని ఆలపిస్తాడు. అంతే కాదు పక్షుల శబ్దాలూ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

అద్భుత బాలుడి పలుకే సంగీతమాయెనే!

ప్రకాశ్​లో అరుదైన ప్రతిభ దాగి ఉంది. అంధుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న తనకు జ్ఞాపకశక్తి ఎక్కువే. ఐదేళ్ల వయసు నుంచే ప్రముఖ సంబల్​పురి పాటలను కంఠస్థం చేసి పాడుతూ ఉండేవాడు. ఇప్పుడు నేపథ్య సంగీతాన్నీ నోటితో పలికిస్తున్నాడు అందరి మనసులు దోచుకుంటున్నాడు.

16 ఏళ్ల ప్రకాశ్​కు పుట్టుకనుంచే కంటిచూపు ​ లేకపోయినా ఎవరి జాలీ, సాయం కోరడు. ఒక్కడే.. వీధుల్లో ధైర్యంగా నడుస్తాడు. మొబైల్ ఫోన్​​ కూడా ఉపయోగిస్తాడు. పేదరికంలో పుట్టినా.. పాటలే ప్రాణంగా పెరిగిన ప్రకాశ్​ ప్రతిభకు మంచి గుర్తింపు రావాలని ఆశిస్తున్నారు కుటుంబసభ్యులు.

ఇదీ చూడండి:అందాలు చూపిన డేగ.. అపాయం గుర్తు చేసింది!

ABOUT THE AUTHOR

...view details