క్రీడాకారులు సొంత లాభం కోసం మైదానంలోకి దిగరు. తమ జట్టు, జిల్లా, రాష్ట్రం, దేశం గౌరవాన్ని పెంపొందించడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఒడిశా సంబల్‌పుర్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారిణిలు సైతం ఒకప్పుడు ఇలానే ఫుట్‌బాల్ ఆటను ఆడేవారు. ఎన్నోసార్లు జాతీయ స్థాయిలో ఆ రాష్ట్రం పేరు నిలబెట్టారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. బీడీలు చుడుతూ.. వేరొకరి ఇంట్లో అంట్లు తోముతూ బతుకుబండిని నెట్టుకొచ్చే దుస్థితి దాపరించింది.
అప్పుడలా.. ఇప్పుడిలా
1998లో ఫుట్‌బాల్ రంగంలోకి దిగిన డోలీ.. 2007లో టీమ్ కెప్టెన్‌గా ఎంపికైంది. పదికి పైగా జాతీయ టోర్నమెంట్లలో పాల్గొని ఎన్నో పథకాలు సాధించింది. ఇప్పుడు పొట్టకూటి కోసం బీడీలు చుడుతోంది. సంబల్పుర్ మహిళా ఫుట్‌బాల్ టీమ్ గోల్‌కీపర్‌గా వ్యవహరించిన మరో క్రీడాకారిణి మీనా మండాది, కోల్‌కతా, అసోం, రోర్కెలాలో గెలిచి ఒడిశా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన దీప్తిది కూడా ఇదే పరిస్థితి.
వెనకబడిపోయారు..