కరోనా నిబంధనలను ఉల్లంఘించిన బీజేడీ ఎమ్మెల్యే ఉమాకాంత సామంత్రాయ్పై కేసు నమోదైంది. కరోనా పాజిటివ్‌గా తేలినా ఐసోలేషన్‌లో ఉండకుండా బీజేడీ నాయకుడు ప్రదీప్ మహారథి అంత్యక్రియల్లో పాల్గొనటంపై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా సోకిన మరో ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్‌పై మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదు. క్వారంటైన్ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
'వారికి కరోనా ఉంది'
సమీర్, సామంత్రాయ్ ఇద్దరు ఎమ్మెల్యేలకూ అసెంబ్లీ సమావేశాల ముందు కరోనా నిర్ధరణ అయ్యింది. సెప్టెంబర్ 12న సమీర్, సెప్టెంబర్ 28న ఉమాకాంత వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో.. ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక నాయకుడు జగన్నాథ్.
వీడియోలో క్షమాపణ..