తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరుగుదొడ్డిలో ఏడు రోజులు క్వారంటైన్​! - 7 days quarantine in bathroom in odisha

ఏడు రోజుల పాటు టాయ్​లెట్​లోనే​ క్వారంటైన్​లో ఉన్నాడో వ్యక్తి. అదేంటి, ఎవరైనా నిర్బంధ కేంద్రాల్లో ఉంటారు, లేదంటే హోం క్వారంటైన్​లో ఉంటారు. మరుగు దొడ్ల క్వారంటైన్​లో ఉండడమేంటి అంటారా? అవును మరి, ఒడిశా​లోని ఓ ఆసుపత్రి నిర్వాకం ఓ పేదింటి కుర్రాడిని టాయ్​లెట్​ క్వారంటైన్​లో ఉండేలా చేసింది.

Odisha: Man spends 7 days in toilet as 'home quarantine'
మరుగుదొడ్డిలో ఏడు రోజులు క్వారంటైన్​!

By

Published : Jun 18, 2020, 5:19 PM IST

అధికారుల నిర్లక్ష్యంతో ఏడు రోజుల పాటు మూత్రశాలలో క్వారంటైన్​లో ఉన్నాడు ఓ ఒడిశా వాసి.

పొమ్మని తరిమారు...

మానస్​ పాత్ర(28) తమిళనాడులో ఓ కంపెనీలో పనిచేసేవాడు. కరోనా విజృంభిస్తున్న వేళ స్వరాష్ట్రం ఒడిశాకు చేరుకున్నాడు. దీంతో మానస్​ను జగత్​ సింగ్​పుర్​ ఆసుపత్రిలో నిర్బంధించారు అధికారులు. ఏడు రోజుల తర్వాత .. అతడిని మరో ఏడు రోజులు హోం క్వారంటైన్​లో ఉండాలని తక్షణమే ఇంటికి వెళ్లాలన్నారు ఆసుపత్రి సిబ్బంది.

ఆరుగురు సభ్యులుండే మానస్​ ఇంట్లో.. హోం క్వారంటైన్ ఉండేంత స్థలం గానీ, వసతులు గానీ లేవన్నాడు. మరో ఏడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండేందుకు అనుమతివ్వాలని మొరపెట్టుకున్నాడు. క్వారంటైన్​ కేంద్రంలో ఉండనివ్వమని బతిమాలాడు. అయినా.. వినలేదు, ఇంటికి వెళ్లాల్సిందే అన్నారు సిబ్బంది.

గత్యంతరం లేక, జూన్​ 9న జాముగాంవ్​ గ్రామంలోని ఇంటికి చేరుకున్నాడు మానస్​. కుటుంబసభ్యులకు తన నుంచి కరోనా సోకే ముప్పుందని.. స్వచ్ఛ భారత్​ యోజన కింద కొత్తగా నిర్మించిన మరుగుదొడ్డిలో హోం క్వారంటైన్​లో ఉండేందుకు సిద్ధమయ్యాడు. మూటా ముళ్లె మూత్ర శాలలో పెట్టుకుని, ఏడు రోజుల పాటు టాయ్​లెట్​లోనే పడక, భోజనం కానిచ్చాడు.

మరుగుదొడ్డిలో ఏడు రోజులు క్వారంటైన్​!

ఇదీ చదవండి:కరోనా వేళ గుదిబండగా మారిన గృహహింస

ABOUT THE AUTHOR

...view details