ఫొని తుపాను...ఒడిశా, పశ్చిమ్ బంగ రాష్ట్రాలను గడగడ వణికించింది. వేలాదిమందిని నిరాశ్రయులుగా మార్చిందీ తుపాను. రాష్ట్రంలో మే 3న ఫొని సృష్టించిన బీభత్సం కారణంగా 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపానుతో ప్రకృతికి పెనుముప్పే వాటిల్లింది. భువనేశ్వర్, పూరీల్లో సుమారు 10 లక్షల చెట్లు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా భువనేశ్వర్లో రెండు దశాబ్దాలుగా చూస్తున్న చెట్లతో అనేకమందికి మానసిక అనుబంధం ఉంది.
"రహదారులపై కూలిన చెట్లను చూస్తే కన్నీరు ఉబుకుతోంది. వాటిని మా పిల్లల్లా పెంచాం. పాక్షిక నష్టం సంభవించిన చెట్లను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకూ 40 మందితో బృందంగా ఏర్పడి గత నాలుగు రోజులుగా 800 చెట్లను నిలబెట్టాం. ఇప్పుడు ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనావేయలేం. మొత్తం పచ్చదనం పోయింది."
-అశోక్ మిశ్రా, ప్రాంతీయ అటవీ అధికారి
నాయపల్లి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ మామిడి చెట్టు నేలకూలినందుకు విలపిస్తున్నారు. ఆ చెట్టును తన నానమ్మ నాటినట్లుగా పేర్కొన్నారు.