తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫొని బాధిత రైతులకు ఒడిశా ప్రభుత్వం ఆర్థిక సాయం! - వ్యవసాయం

ఫొని బాధిత రైతులను ఆదుకుంటామన్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వ్యవసాయం, అనుబంధ రంగాల సహాయార్థం రూ. 16వందల కోట్ల ఆర్థిక సహాయాన్నందిస్తామని స్పష్టం చేశారు.

ఫొని బాధిత రైతులకు ఒడిశా ప్రభుత్వం ఆర్థిక సాయం!

By

Published : May 11, 2019, 11:56 PM IST

ఫొని తుపాను బాధిత రైతులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. వ్యవసాయం సహా అనుబంధ రంగాలైన పశుపోషణ, చేపల పెంపకం వంటి రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 16 వందల కోట్ల ఆర్థిక సహాయన్నందించనున్నామని స్పష్టం చేశారు. 22 శాతం కంటే ఎక్కువ పంట నష్టం చెందిన నీటి వసతిలేని మెట్ట ప్రాంత రైతులకు హెక్టారుకు రూ. 6800 చొప్పున అందిస్తామన్నారు. నీటి వసతి ఉన్న వ్యవసాయదారులకు రూ. 13,500.... దీర్ఘకాల పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 18 వేల చొప్పున సహాయం అందిస్తామన్నారు.

తమలపాకు రైతులకు రూ. 15వేలు, పుట్టగొడుగు సాగు షెడ్లకోసం రూ. 40వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. అరటి రైతులకు హెక్టారుకు రూ. 25వేలు, పాడి రైతులు పాలిచ్చే పశువును కోల్పోతే రూ. 30వేలు, పాలివ్వని వాటికి రూ. 25వేలు, గొర్రె, మేకలకు ఒక్కింటికి రూ.3 వేల చొప్పున అందిస్తామన్నారు.

చేపల పెంపకం దారులకు హెక్టారుకు రూ. 12వేల చొప్పున ఆర్థిక సహాయాన్నందించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: పేదల కులమే నా కులం: మోదీ

ABOUT THE AUTHOR

...view details