సీఎం హెలికాప్టర్ తనిఖీ చేసిన అధికారులు - తనిఖీ
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను ఈసీ అధికారుల తనిఖీ బృందం తనిఖీ చేసింది. ఇందుకు సీఎం పట్నాయక్, ఆయన సిబ్బంది పూర్తిగా సహకరించారు.
సీఎం హెలికాప్టర్లో ఈసీ అధికారులు తనిఖీలు
సీఎం హెలికాప్టర్లో ఈసీ అధికారులు తనిఖీలు
ఒడిశా సీఎం, బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మంగళవారం ఎన్నికల ప్రచారం కోసం రవుర్కెలాకు హెలికాప్టర్లో వచ్చారు సీఎం పట్నాయక్. హెలిప్యాడ్ మీద దిగగానే అక్కడే వేచి ఉన్న అధికారులు సీఎం హెలికాప్టర్లో ఉండగానే సోదాలు చేశారు. బ్యాగులు, సూట్‌కేసులు సహా సీఎం ఔషధాల పెట్టెను తనిఖీ చేశారు. తనిఖీ అధికారులకు పూర్తిగా సహకరించారు సీఎం నవీన్ పట్నాయక్, ఆయన సిబ్బంది.
Last Updated : Apr 17, 2019, 3:34 PM IST