మోటారు వాహనాల చట్టం-2019 అమలుతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానాల మోత మోగుతోంది. తాజాగా ఒడిశాలో ఓ లారీ యజమానికి ఏకంగా రూ.6,53,100 చలానా వేశారు పోలీసులు.
లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా - ఒడిశా
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఓ లారీ యజమానికి రూ.6,53,100 జరిమానా విధించారు అధికారులు. ఈ ఘటన ఈనెల 10న ఒడిశా సంబల్పుర్లో జరిగింది.
లారీ యజమానికి రూ.6.53 లక్షలు జరిమానా
నాగాలాండ్‌కు చెందిన లారీ సంబల్‌పుర్‌కు వచ్చిన క్రమంలో ఈనెల 10న ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేశారు. గాలి, ధ్వని కాలుష్యం, ఎలాంటి అనుమతులు లేకుండా వస్తు రవాణా వాహనంలో ప్రయాణికులను తరలించటం, వాహన బీమా లేకపోవటం, 2014 జులై నుంచి సెప్టెంబర్ 2019 వరకు పన్నులు చెల్లించకపోవటం వల్ల ఈ మేరకు భారీ జరిమానా విధించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం
Last Updated : Sep 30, 2019, 2:42 PM IST