ఒడిశా జాజ్పుర్లో 104 ఏళ్ల మాస్టారు అద్భుతంగా పాఠాలు చెబుతూ ఔరా అనిపిస్తున్నారు. 75 ఏళ్లుగా ఉచితంగానే పాఠాలు బోధిస్తూ ఎందరికో విద్యాదానం చేస్తున్నారు.
104 ఏళ్ల వయసులోనూ ఉచితంగా పాఠాలు బోధిస్తూ.. - వృద్ధ మాస్టారు ఉచిత పాఠాలు
అరవై ఏళ్లు రాగానే విశ్రాంతి తీసుకోవాలనుకునే వారెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన. అరవై కాదు.. వందేళ్లు పైబడినా అలుపెరగని యోధుడిలా శ్రమిస్తున్నారు. 104 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా అదీ ఉచితంగా పాఠాలు చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
104ఏళ్లలోనూ ఉచితంగా పాఠాలు బోధిస్తున్న మాస్టారు
స్థానిక సర్పంచ్.. ఆ ఉపాధ్యాయుడి శ్రమను గుర్తించారు. ప్రభుత్వం తరఫున ఆయనకు సాయమందించే ఏర్పాటు చేశారు. దీనికి ఆ ఉపాధ్యాయుడు ససేమిరా అన్నారు. అయితే.. ఆ సొమ్ముతో విద్యార్థులకు సరైన వసతులు కల్పిస్తామని చెప్పారు సర్పంచ్.
ఇదీ చదవండి:ఉత్తరాలు పంచే పోస్ట్‌మ్యాన్ నటనకు ప్రాణం పోస్తే..?