తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రత్యేకం: ఎందరికో ఆదర్శంగా ట్రాన్స్​జెండర్​ రాణి..! - ఉబర్‌లో డ్రైవర్‌

ఒడిశాకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజంలోని ఎన్నో అడ్డంకులను దాటుకొని ధైర్యంగా నిలబడ్డారు. రైళ్లలో యాచించడమే తన జీవితం కాకుండా..... తలెత్తుకొని జీవనం సాగించాలని నిర్ణయించుకున్నారు. ఉబర్‌లో డ్రైవర్‌గా చేరి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్ సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా పేరు సంపాదించారు.

తనలాంటి వారికి ఆదర్శంగా నిలిచిన ట్రాన్స్‌జెండర్

By

Published : Sep 24, 2019, 6:22 AM IST

Updated : Oct 1, 2019, 7:03 PM IST

ప్రత్యేకం: ఎందరికో ఆదర్శంగా ట్రాన్స్​జెండర్​ రాణి..!

ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన రాణి కిన్నర్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ తనలాంటి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజంలో సగర్వంగా జీవించాలనే ఆలోచన తన జీవితాన్నే మార్చేసింది. రైళ్లలో యాచిస్తూ జీవనం సాగించే తాను.. ఈరోజు ఉబర్‌ డ్రైవర్లలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు.

ఉద్యోగంలోకి రాకముందు..

మొదట్లో ఎందరో ట్రాన్స్‌జెండర్ల జీవితాల మాదిరిగా రైళ్లలో యాచిస్తూ జీవనం గడిపేవారు రాణి. ఇలా ఉండటం.. సరికాదని భావించారు. ఎన్నో కఠిన పరిస్థితులు అనుభవించిన రాణి.. సమాజంలో సగర్వంగా జీవించాలని నిశ్చయించుకున్నారు.

ఆ తరువాత..

అంతే ఇక స్వతంత్రంగా జీవించడానికి ఓ చికెన్ ఫాంలో ఉద్యోగం సంపాదించిన రాణి... ఆ తర్వాత డ్రైవింగ్‌పై మక్కువతో ఆటో నడపడం ప్రారంభించారు. తన ఆటోలో కూర్చొని ప్రయాణించడానికి చాలా మంది వెనకడుగు వేయటం వల్ల ఆ పని విరమించుకున్నారు. ఆ తరువాత ఉబర్‌ క్యాబ్స్‌లో చేరి తన డ్రైవింగ్‌ నైపుణ్యంతో ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ రూపంలో ఫైవ్‌ స్టార్ రేటంగ్ సాధించారు. ఈ రోజు ఉబర్‌ డ్రైవర్లలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు.

తాను సగర్వంగా జీవనం సాగించడమే కాకుండా తన చుట్టు పక్కల ఉన్న ఇతర ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతికేలా రాణి కిన్నర్ ప్రోత్సహిస్తున్నారు. రాణి పట్టుదల చూసి చుట్టుపక్కల ఉండే ఇతర ట్రాన్స్‌జెండర్లు కూడా తన మార్గంలోనే నడుస్తామని చెబుతున్నారు.

ఇదీ చూడండి : వైరల్​: ఆ బాలుడు కోరితే మోదీ, ట్రంప్ కాదనలేకపోయారు!

Last Updated : Oct 1, 2019, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details