తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2019, 4:58 PM IST

Updated : Dec 15, 2019, 7:41 PM IST

ETV Bharat / bharat

కాంగ్రెస్​ వల్లే 'పౌర' నిరసనలు: మోదీ

దేశంలో పౌరసత్వ సవరణపై చెలరేగుతున్న ఆందోళనల వెనుక కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల హస్తం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చేసి.. భాజపా దేశానికి మేలు చేసినట్టు ప్రజలు విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు.

modi
'పౌర' ఆందోళనల వెనక కాంగ్రెస్: మోదీ

కాంగ్రెస్​ వల్లే 'పౌర' నిరసనలు: మోదీ

విపక్ష కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పౌరసత్వ చట్ట సవరణపై జరుగుతున్న ఆందోళనల వెనుక కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ఉన్నాయని ఆరోపించారు.

ఝార్ఖండ్​ దుమ్​కాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. విపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

"కాంగ్రెస్ సహా వారి సహచర పార్టీలు.. అర్థం చేసుకోండి... దేశంలో నెలకొన్న పరిస్థితులకు మీరే కారణం. ఇప్పుడు చెలరేగుతున్న అల్లర్ల వెనుక ప్రధానంగా ఉన్నది మీరే. దేశం మిమ్మల్ని గమనిస్తోంది. దేశ ప్రజల విశ్వాసం మాపై పెరుగుతోంది. మోదీ, భారత పార్లమెంట్, ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ చేపట్టి దేశానికి మేలు చేకూర్చామని ప్రజల్లో నమ్మకం పెరిగింది. మా నిర్ణయం సరైనదని మీ అసమ్మతిని చూస్తుంటేనే అర్థం అవుతోంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ప్రజా సమస్యలను పక్కనపెట్టి విపక్షపార్టీలు.. వారి సొంత లాభం కోసమే పని చేస్తున్నాయని విమర్శించారు ప్రధాని.

ఇదీ చూడండి: మూడో అంతస్తు నుంచి దూకిన రోగి.. ఆ తర్వాత..!

Last Updated : Dec 15, 2019, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details