తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ: అమల్లోకి 'సరి-బేసి' విధానం- చలానాలు మొదలు

దేశ రాజధాని దిల్లీలో సరి-బేసి విధానం ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నేడు సరి సంఖ్య ఉన్న వాహనాలను అనుమతించింది దిల్లీ ప్రభుత్వం. నిబంధనల అమలు కోసం నగర వ్యాప్తంగా 200 ప్రదేశాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ట్రాఫిక్​ విభాగం.

odd even

By

Published : Nov 4, 2019, 10:53 AM IST

Updated : Nov 4, 2019, 12:14 PM IST

అమల్లోకి 'సరి-బేసి' విధానం

దిల్లీలో వాయుకాలుష్య తీవ్రత తగ్గించేందుకు నేటి నుంచి సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిబంధనలు వర్తిస్తాయి. నేడు సరి సంఖ్య ఉన్న వాహనాలకే దేశ రాజధానిలో అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.

సరి-బేసి విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు దిల్లీలో సుమారు 200 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించినవారికి రూ.4 వేలు జరిమానా విధిస్తున్నారు. ఇప్పటికే బేసి సంఖ్య నంబర్​ ప్లేట్లతో తిరుగుతున్న పలు వాహనాలకు చలానా వేశారు పోలీసులు.

దిల్లీలో సరి- బేసి విధానం ఇంతకుముందు అమల్లో ఉండేది. ఈ విధానంపై ప్రజలకు ముందుగానే అవగాహన కలిగేలా ప్రచారం నిర్వహించింది దిల్లీ ప్రభుత్వం.

ఇదీ చూడండి: దిల్లీ కాలుష్యం: ఆయువు తోడేస్తున్న వాయువు

Last Updated : Nov 4, 2019, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details