తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ నినాదం: 'ఇప్పుడు న్యాయం జరుగుతుంది' - ప్రచార గీతం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార నినాదాన్ని ప్రకటించింది. కనీస ఆదాయ పథకం (న్యాయ్​)ను ముఖ్యాంశంగా తీసుకుని 'అబ్​ హోగా న్యాయ్​' పేరుతో ప్రచార గీతాన్నీ విడుదల చేసింది.

అబ్​ హోగా న్యాయ్-కాంగ్రెస్ ప్రచార నినాదం

By

Published : Apr 7, 2019, 4:03 PM IST

Updated : Apr 7, 2019, 7:23 PM IST

'న్యూన్​తమ్​ ఆయ్​ యోజన' కింద పేదలకు ఏటా రూ.72వేలు అందిస్తామన్న హామీ ప్రధానాంశంగా ఎన్నికల ప్రచారం సాగిస్తోంది కాంగ్రెస్. ఆ పథకం పేరు కలిసొచ్చేలా 'అబ్​ హోగా న్యాయ్' పేరుతో ఎన్నికల నినాదాన్ని విడుదల చేసింది. న్యాయ్​ పేరుతో ప్రచార గీతాన్ని రూపొందించింది.

రచయిత జావెద్ అఖ్తర్ ప్రచార గీతాన్ని రచించారు. వీడియో చిత్రాన్ని నిఖిల్ అడ్వాణీ రూపొందించారు. ఈ గీతాన్ని ప్రదర్శించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. తెరలతో కూడిన కంటైనర్​ వాహనాల్ని దేశమంతటా తిప్పి ప్రదర్శించనున్నారు.

న్యాయ్​ అంటే కనీస ఆదాయ పథకం మాత్రమే కాదని... అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చడమని దిల్లీలో చెప్పారు కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ.

అబ్​ హోగా న్యాయ్-కాంగ్రెస్ ప్రచార నినాదం

"దేశ ప్రజల ముందు వాస్తవ అంశాల్ని ఉంచాం. గత ఐదేళ్లలో రైతులు, యువత, మహిళలు, వ్యాపారవర్గాలకు కష్టకాలం నడిచింది. మంచి రోజులిస్తానన్న వ్యక్తి అతి కష్టమైన రోజులనిచ్చారు. 2019 ఎన్నికల ప్రచార నినాదం సులభమైనది. ప్రజల ఆకాంక్షలు చేరుకునేందుకు ప్రయాసపడుతున్నాం. దేశ ప్రయోజనాలనూ, కష్టాలు అనుభవిస్తున్నవారి భావాల్ని పరిగణనలోకి తీసుకుని మా ప్రచార నినాదం న్యాయ్​ను రూపొందించాం. న్యాయ్ కేవలం ఓ శబ్దమే కాదు... ఎంతో తీవ్రమైనది... దాని వెనక ఎంతో కసరత్తు చేశాం. అందుకే దేశం ప్రస్తుతం న్యాయ్ జపం జపిస్తోంది.''
-ఆనంద్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత

Last Updated : Apr 7, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details