సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో 'న్యాయ్' (కనీస ఆదాయ పథకం) తమ ప్రధాన ప్రచార అస్త్రమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నిలబెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆదివారం 'అబ్ హోగా న్యాయ్' (ఇప్పుడు న్యాయం జరుగుతుంది) అంటూ పార్టీ ఎన్నికల నినాదాన్ని ప్రకటించింది. భాజపా ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయానికి బదులుగా పేదలందరికీ 'కనీస ఆదాయ పథకం (న్యాయ్) ద్వారా న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
కాంగ్రెస్ ప్రచార వీడియోను సామాజిక మాధ్యమాల్లో అందరికీ షేర్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు.
"కనీస ఆదాయ పథకం 'న్యాయ్' ప్రధాన అంశంగా కాంగ్రెస్, జాతీయ ప్రసారమాధ్యమాల్లో, మల్టీమీడియా వేదికల్లో ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల ఆధారంగా ఈ ప్రచారం కొనసాగుతుంది."-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్వీట్