అధికారంలోకి వచ్చాక కనీసం ఆదాయ పథకం న్యాయ్( న్యూన్తమ్ ఆయ్ యోజన)ను అమలుచేస్తామని ఇటీవల చేసిన ప్రకటనతో భారతీయ జనతా పార్టీలో అయోమయం నెలకొందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విమర్శించారు. న్యాయ్ పథకం ప్రజాకర్షకం కాదని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.
"న్యాయ్ హామీతో భాజపాలో అయోమయం" - కాంగ్రెస్ పార్టీ
న్యాయ్ పథకం ప్రకటనతో భారతీయ జనతా పార్టీ గందరగోళంలో పడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. న్యాయ్ పథకం ప్రజాకర్షకం కాదని, పేదరిక నిర్మూలనకు ఉద్దేశించినదని స్పష్టంచేశారు.
!["న్యాయ్ హామీతో భాజపాలో అయోమయం"](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2828668-929-83acd6f5-85dd-4e5a-9d0c-269c9b134f95.jpg)
"న్యాయ్ హామీతో భాజపాలో అయోమయం"
న్యాయ్ పథకంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కొన్ని...
- మోదీ చేసిన నోట్ల రద్దుకు పూర్తి వ్యతిరేక దిశగా ఈ పథకం పనిచేస్తుంది.
- న్యాయ్ పథకం 20 శాతం ప్రజలకు నగదు ఇవ్వటమే కాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుంది. పేదలకు ఈ పథకం ద్వారా న్యాయం చేయాలనుకుంటున్నాం.
- ఎన్డీఏ హయాంలో మోదీ లాగేసుకున్న దానిని మళ్లీ పేదలకు ఇవ్వాలనుకుంటున్నాం.
- మోదీ తన పనిని సరిగా చేసి ఉంటే ఇప్పటికే పేదరికం అంతరించిపోయేది.
- న్యాయ్ పథకం ఒక మైలు రాయిలాంటిది. అమలు చేయదగ్గ పథకం, దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి భారం పడదు.
- ఇది అసలు ప్రజాకర్షకమే కాదు. పేదరికం నిర్మూలించే అతిపెద్ద పథకం.
- ఎన్డీఏ అమలు చేసిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), నోట్ల రద్దులా కఠినంగా అమలు చేయం.
- న్యాయ్ పథకం వల్ల ఉత్పత్తి, వినియోగం రెండూ పెరుగుతాయి.