తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నర్సింగ్​ హోంలన్నీ కరోనా ఆసుపత్రులే

కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10-49 పడకల సామర్థ్యం ఉన్న అన్ని నర్సింగ్​ హోమ్స్​ను కరోనా బాధితుల చికిత్స కోసం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పడకల సామర్థ్యం పెరుగుతుందని, కరోనా బాధితులు-ఇతర రోగులను వేరుచేయవచ్చని పేర్కొంది.

Nursing homes with bed capacity of 10 to 49 declared COVID nursing homes in Delhi
ఆ నర్సింగ్​ హోంలన్నీ కరోనా ఆసుపత్రులే!

By

Published : Jun 14, 2020, 11:25 AM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది దిల్లీ ప్రభుత్వం. 10-49 పడకలు ఉన్న నర్సింగ్​ హోంలను పూర్తిగా కరోనా బాధితుల చికిత్స కోసం వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్​ కాపిటల్​ టెరిటరీ(ఎన్​సీటీ) ఆఫ్​ దిల్లీకి ఆదేశాలు జారీ చేసింది.

"చిన్న, మధ్యస్థ మల్టీస్పెషాలిటీ నర్సింగ్​ హోమ్స్​లోని కరోనా బాధితులు, ఇతర రోగులను వేరుచేయడం కోసం, ఎన్​సీటీ పరిధిలోని అన్ని నర్సింగ్​ హోమ్స్​(10-49 పడకల సామర్థ్యం)లను ప్రత్యేకంగా కరోనా రోగుల చికిత్స కోసమే వినియోగించాలి. కరోనా రోగుల చికిత్స కోసం పడకలను పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది."

-- దిల్లీ ప్రభుత్వం.

ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి మూడు రోజుల్లోగా అమలు చేయాలను స్పష్టం చేసింది ప్రభుత్వం. లేదంటే నిబంధనలు ఉల్లఘించినట్టు అవుతుందని, చర్యలు చేపడతామని హెచ్చరించింది.

కంటి, ఈఎన్​టీ, డయాలసిస్​ కేంద్రాలు, ప్రసూతి గృహాలు, ఐవీఎఫ్​ కేంద్రాలకు తాజా నిర్ణయం నుంచి మినహాయింపును ఇచ్చింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:-ఒక్కరోజు మరణాల్లో 'మహా'ను మించిన దేశ రాజధాని

ABOUT THE AUTHOR

...view details