భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాజధాని చెన్నైలో రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వాన నీరు చేరుకుంది. అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.
చెన్నైలో భారీ వర్షాలు- జనావాసాలు జలమయం - ఐఎండీ చెన్నై
తమిళనాడు రాజధాని చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇళ్లల్లోకి వాన నీరు చేరుకుంది. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
చెన్నైలో భారీ వర్షాలు- ఇళ్లల్లోకి చేరిన నీరు
రామేశ్వరంలోనూ వర్షాలు భారీగా కురిశాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఇదీ చూడండి:-మునిగిపోతున్న శిశువును తల్లి చెంతకు చేర్చి..