తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వోకల్​ ఫర్​ లోకల్​: దేశీ జాతి శునకాలకు ప్రత్యేక శిక్షణ - PM

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని ఎన్​డీఆర్​ఎఫ్​ కేంద్రంలో శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర సమయాల్లో బలగాలకు సాయం చేసేందుకు.. విదేశీ జాతి శునకాలకు బదులుగా దేశీ జాతి కుక్కలకు తర్ఫీదు ఇస్తున్నారు. శిక్షణ పొందిన శునకాలతో త్వరలో డాగ్​ స్క్వాడ్​ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Indian breed dogs are now also being trained by National Disaster Response Force (NDRF)
వోకల్​ ఫర్​ లోకల్​: దేశీ జాతి శునకాలకు ప్రత్యేక శిక్షణ

By

Published : Oct 30, 2020, 8:45 AM IST

నేరపరిశోధన, విపత్తులు, అత్యవసర సమయాల్లో ఆధారాలు పసిగట్టేందుకు ఇన్నాళ్లు విదేశీ జాతి శునకాలను వినియోగించిన భద్రతా బలగాలు.. ఇకపై వాటి స్థానంలో దేశీ జాతి కుక్కలనే ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌ ఎన్​డీఆర్​ఎఫ్​ కేంద్రంలో శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర సమయాల్లో బలగాలకు సాయం చేసేందుకు వీలుగా జాతి శునకాలకు తర్పీదు ఇస్తున్నారు. ఇలా శిక్షణ తీసుకున్న వాటితో డాగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్​డీఆర్​ఎఫ్​ 8వ బెటాలియన్​ కమాండెంట్ పీకే తివారీ తెలిపారు.

దేశీ జాతి శునకాలకు ప్రత్యేక శిక్షణ
దేశీ జాతి శునకాలకు శిక్షణ

విదేశీ జాతి శునకాలపై ఆధారపడకుండా.. దేశీ వాటికే కావాల్సిన మెలకువలు నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ఈ శునకాలకు శిక్షణ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తివారీ చెప్పారు. కొన్ని కుక్కలు శిక్షణకు దూరంగా పారిపోయినట్లు తెలిపారు. అయినా.. చాలా ఓపికగా తర్పీదు ఇస్తున్నట్లు వివరించారు.

శిక్షణ పొందిన శునకాలతో డాగ్​ స్క్వాడ్​ ఏర్పాటు
ఎన్​డీఆర్​ఎఫ్​ కమాండెంట్​ తివారీ

ABOUT THE AUTHOR

...view details