తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గణతంత్ర పరేడ్'​కు పరిమితంగానే సందర్శకులు! - External Affairs Minister S Jaishankar

కొవిడ్​-19 వ్యాప్తి దృష్ట్యా వచ్చే ఏడాది జరగనున్న గణతంత్ర పరేడ్​కు తక్కువ మంది సందర్శకులను అనుమతించనున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్​ మార్గదర్శకాల నడుమ.. గణతంత్ర వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నట్టు తెలుస్తోంది.

Number of visitors to be scaled down for Republic Day parade due to COVID-19
'గణతంత్ర పరేడ్'​కు పరిమితంగానే సందర్శకులు!

By

Published : Dec 30, 2020, 9:29 AM IST

కరోనా వ్యాప్తి కారణంగా 2021 గణతంత్ర పరేడ్ వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నాయి. కొత్త కరోనా వైరస్​ ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో.. పరిమిత సంఖ్యలో సందర్శకులను అనుమతించనున్నారు. కొవిడ్​ మార్గదర్శకాలను పాటిస్తూ.. కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొవిడ్​-19 విజృంభణ నేపథ్యంలో.. ఎర్రకోటలో ఈ ఏడాది ఆగస్టు-15 వేడుకలు కూడా సాధారణంగానే జరిగాయి.

రిపబ్లిక్​ డే(జనవరి-26)కు కొద్దిరోజులే మిగిలి ఉన్నందున.. దిల్లీలో చల్లటి వాతావరణంలోనే కవాతు కోసం రిహార్సల్స్​ చేస్తున్నారు సైనికులు.

భారత 72వ గణతంత్ర వేడుకలకు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ పేర్కొన్నారు. ఫలితంగా భారత్​-యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details