తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 9:42 PM IST

ETV Bharat / bharat

ఇక రోజూ 5 వేల మందికి శబరిమల దర్శనం

శబరిమలలో ఇక నుంచి రోజూ 5వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనుంది కేరళ ప్రభుత్వం. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి దర్శన టికెట్ల బుకింగ్​కు​ అనుమతి ఉంటుందని తెలిపింది. కొవిడ్​-19 దృష్ట్యా ఆలయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కేరళ దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.

number of piligrims to visit sabarimala temple increased
ఇక నుంచి రోజు 5వేల మందికి శబరిమల దర్శనం

శబరిమలలో రోజూవారి భక్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న రెండు వేల నుంచి ఐదు వేలకు పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దర్శన టికెట్లు మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి

కరోనా దృష్ట్యా ఆలయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కేరళ దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు ప్రయాణ సమయానికి 24 గంటల ముందు పరీక్ష చేయించుకోవాలని, కరోనా నెగిటివ్​ రిపోర్టు తీసుకొచ్చిన వారికే అనుమతి ఉంటుందన్నారు. డిసెంబర్ 26 తర్వాత వచ్చే భక్తులు కొవిడ్​ (ఆర్​టీ- పీసీఆర్​) నెగిటివ్​ రిపోర్టును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. రిపోర్టు లేని వారికి నీలక్కల్​లోనే పరీక్షలు చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.

ఇదీ చదవండి :నిత్యం 5వేల మందికి అయ్యప్ప దర్శనం!

ABOUT THE AUTHOR

...view details