దేశంలో 5కు చేరిన కరోనా మరణాలు- మొత్తం 324 కేసులు - corona updates in india
కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. వైరస్ సోకి మహారాష్ట్రలో మరొకరు మరణించారు. ఫలితంగా మృతుల సంఖ్య 5కు చేరింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో 324కు చేరిన కరోనా కేసులు: ఆరోగ్యశాఖ
By
Published : Mar 22, 2020, 11:00 AM IST
|
Updated : Mar 22, 2020, 11:59 AM IST
భారత్‌లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5కు చేరింది. మహారాష్ట్రలో 63 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. అటు... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23 మంది బాధితులు కొవిడ్- 19 నుంచి కోలుకున్నట్లు పేర్కొంది.
మహారాష్ట్రలోనే తీవ్రం
మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇవాళ మరో వ్యక్తి ప్రాణాలు విడవగా... అక్కడ కరోనా మృతుల సంఖ్య 2కి చేరింది. గత 24 గంటల్లో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మహారాష్ట్రలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74కు చేరింది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు
రాష్ట్రం
పాజిటివ్ కేసులు
మృతుల సంఖ్య
మహారాష్ట్ర
74
2
కేరళ
52
దిల్లీ
27
1
ఉత్తర్‌ప్రదేశ్
25
తెలంగాణ
21
రాజస్థాన్
24
హరియాణా
17
కర్ణాటక
20
1
పంజాబ్
13
లద్ధాఖ్
13
1
గుజరాత్
14
తమిళనాడు
6
చండీగఢ్
5
మధ్యప్రదేశ్
4
జమ్ము కశ్మీర్
4
బంగాల్
4
ఆంధ్రప్రదేశ్
3
ఉత్తరాఖండ్
3
ఒడిశా
2
హిమాచల్‌ప్రదేశ్
2
పుదుచ్చేరి
1
ఛత్తీస్‌గఢ్
1
మొత్తం
324
5
జనతా కర్ఫ్యూ
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా 'జనతా కర్ఫ్యూ' పాటిస్తున్నారు ప్రజలు. దీనితో దిల్లీ, ముంబయి, చెన్నై సహా పలు ప్రధాన నగరాలన్నీ ఉదయం నుంచే నిర్మానుష్యంగా మారాయి. ఇందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ, మార్కెట్లు, రోడ్లు, ఆలయాలు, దుకాణాలు, మైదానాలు.. ఇలా అన్ని మూసివేశారు. ఎటు చూసినా అంతా నిశ్శబ్దమే.