కొవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఈ సమయంలో ఫేస్‌బుక్ లైవ్ వీడియోలకు డిమాండు భారీగా పెరిగింది. కరోనావైరస్ సమాచారం కోసం చాలా మంది ఈ లైవ్‌వీడియోలను చూస్తున్నారు. అయితే ఈ వీడియోలను ఫేస్‌బుక్ ఖాతాలేని వారు చూసేందుకు వీలుండేది కాదు. అయితే ఇప్పుడు ఖాతా లేకున్నా లైవ్ వీడియోలను వీక్షించేలా ఫేస్‌బుక్ సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.
ఇప్పటికే డెస్క్‌టాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు తాజాగా అందుబాటులోకి వచ్చింది ఉంది. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది ఫేస్‌బుక్. మరో వారంరోజుల్లో ఐఓఎస్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా..