కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించే శ్రామిక్ ప్రత్యేక రైళ్ల స్టాపుల్లో మార్పులు చేసింది రైల్వే శాఖ. రైలు బయలు దేరిన చోటు నుంచి 3 స్టేషన్లలో ఆపాలని నిర్ణయించారు అధికారులు. ఈ రైళ్లలో ప్రస్తుతం 1200మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఆ సంఖ్యను 1700లకు పెంచుతున్నట్లు తెలిపారు. రైల్వే జోన్ల ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బోగీకి 72 మంది మాత్రమే..
రైళ్ల సామర్థ్యానికి తగిన విధంగా స్లీపర్ బెర్తలు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. శ్రామిక్ రైలులో 24 బోగీలు ఉంటాయి. భౌతిక దూరం దృష్ట్యా ప్రతి బోగీలో ప్రస్తుతం 54మంది ప్రయాణికులనే అనుమతిస్తున్నారు. ఆ సంఖ్యను 72కు పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు.