తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా లక్షణాలు లేని వారి నుంచీ వైరస్ వ్యాప్తి! - corona alive in plasyic for three days

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి న్యూ ఇంగ్లాండ్ మెడికల్ జర్నల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఆచార్యులు పరిశోధన చేశారు. కరోనా ఆయా ప్రదేశాల్లో 24 గంటల నుంచి మూడు రోజుల వరకు బతికుండే అవకాశం ఉందని తేల్చారు. తమకు వైరస్ సోకిందని తెలియకుండానే పలువురు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించారు.

corona
కరోనా లక్షణాలు లేని వారి నుంచీ వైరస్ వ్యాప్తి!

By

Published : Mar 22, 2020, 4:10 PM IST

కరోనా లక్షణాలు లేనివారి నుంచీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. 'న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసన్​' ఈమేరకు వ్యాసం ప్రచురించింది. వైరస్ వేర్వేరు వస్తువులపై బతికి ఉండే కాలాన్నీ వివరించింది. వాటిని ముట్టుకుని ఇతరులతో సన్నిహితంగా మెలిగితే వారికి సోకే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

కాలిఫోర్నియా-లాస్​ ఏంజిల్స్​ విశ్వవిద్యాలయం(యూసీఎల్​ఏ) పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. 2003లో వచ్చిన సార్స్, నేటి కరోనా వైరస్​లను పోల్చారు. ఈ వైరస్​లు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో పరిశీలించారు.

వైరస్ ఇంట్లోని వస్తువులకు, ఆసుపత్రిలో ఎలా వ్యాపిస్తుందో గుర్తించేందుకు యత్నించారు శాస్త్రవేత్తలు. ఆయా వస్తువులపై వైరస్ జాడను గుర్తించి అక్కడ బతికుండే కాలాన్ని గణించారు.

3 గంటల్లోనే...

స్వేద, లాలాజలాన్ని పరిశోధించడం ద్వారా మూడుగంటల్లోగా వైరస్​ను గుర్తించవచ్చని పేర్కొన్నారు పరిశోధకులు. వారి అధ్యయనంలో తేలిన మరిన్ని అంశాలు:

  • కరోనా నాలుగు గంటలపాటు రాగిపై నిలిచి ఉంటుందని తేల్చారు పరిశోధకులు. కార్డ్​బోర్డుపై 24 గంటలపాటు వైరస్ బతికి ఉంటుందని, అదే సమయంలో ప్లాస్టిక్​పై మూడు రోజులవరకు ఉండగలదని చెప్పారు.
  • సార్స్ వ్యాధి బాధితులను గుర్తించి ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా నాడు వ్యాప్తిని అరికట్టగలిగారు. ఈ నేపథ్యంలో కరోనా కూడా ఇదే లక్షణం కలిగి ఉందని తేల్చారు శాస్త్రవేత్తలు. అయితే కరోనా వ్యాప్తి సార్స్​తో పోల్చితే ఎక్కువని చెప్పారు.
  • కరోనా సోకిన వారు తమకు తెలియకుండానే వైరస్​ను వ్యాప్తి చేస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో వ్యాధి లక్షణాలు కనిపించకముందే ఈ ప్రమాదం జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
  • సార్స్​ వ్యాధి సమయంలో వైరస్​ను అరికట్టేందుకు ఎక్కువగా చర్యలు తీసుకున్నారని, కానీ కరోనా నియంత్రణ కోసం ఇలా జరగలేదని తేల్చి చెప్పారు. సార్స్​కు భిన్నంగా ఆసుపత్రుల్లో కంటే.. సామాజికంగానే కరోనా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.
  • ఆసుపత్రుల్లో కరోనా ఎక్కువగా విస్తరించేందుకు అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యులకు సూచనలు చేశారు.

ఇదీ చూడండి:న్యూయార్క్​పై కరోనా పంజా- 5వేలకుపైగా పాజిటివ్ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details