'గట్టి చర్యలు తీసుకోవాలి'
కరోనాపై పోరాటం లక్ష్యంగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
కరోనా విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షిస్తున్న ప్రధాని
16:48 March 20
'గట్టి చర్యలు తీసుకోవాలి'
కరోనాపై పోరాటం లక్ష్యంగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
కరోనా విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షిస్తున్న ప్రధాని
16:12 March 20
కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మీడియా సమావేశం నిర్వహించింది. వైరస్‌పై అనుమానాలు ఉంటే 1075 నంబర్‌ను సంప్రదించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు నివారణ చర్యలే ముఖ్యమని.. సామాజిక దూరం అలవాటు చేసేందుకే జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునిచ్చారని స్పష్టం చేశారు అధికారులు. ఆదివారం ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు.
14:14 March 20
కరోనా వైరస్ నియంత్రణకు దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నిత్యావసరాలు, ఔషధాలు మినహా ఇతర షాపింగ్ మాల్స్ అన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
ముంబయి, పుణె సహా ఇతర ముఖ్య నగరాల్లోని కార్యాలయాలన్నీ మూసివేయాలని ఆదేశించింది మహారాష్ట్ర సర్కార్. ప్రభుత్వ కార్యాలయాలు 25శాతం మంది ఉద్యోగులతో మాత్రమే పనిచేస్తాయని స్పష్టంచేసింది.
13:16 March 20
చైనా వీడియో కాన్ఫరెన్స్
కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తోంది చైనా. వైరస్ కట్టడికి చేపట్టిన చర్యలు, అనుభవాలను పంచుకునేందుకు చైనా ఓ వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భారత్‌తో సహా 10 దేశాలు పాల్గొననున్నాయి. వైరస్ నియంత్రణకు సూచనలు అందించనుంది చైనా.
12:12 March 20
వాట్సాప్ నంబర్...
కరోనాపై అవగాహన, సాయం పొందడానికి ప్రభుత్వం ఓ వాట్సాప్ నంబర్‌ను విడుదల చేసింది.
12:07 March 20
206కు చేరిన కేసులు...
దేశంలో కరోనా కేసుల సంఖ్య 206కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.
11:24 March 20
ఇటలీ నుంచి వచ్చిన 69 ఏళ్ల పర్యటకుడు జైపుర్‌లో మరణించాడు. ఆ వ్యక్తి ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. అయితే అనూహ్యంగా ఈ రోజు జైపుర్ ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రిలో గుండె పోటు వచ్చి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
11:19 March 20
మరో నాలుగు...
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో మరో నలుగురికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటికే దేశంలో 195 మంది వైరస్ బారిన పడినట్లు నిర్ధరణయింది.
10:15 March 20
దేశవ్యాప్తంగా 195కు చేరిన కరోనా కేసులు
దేశంలో కరోనా బారినపడ్డ వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 195 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 32 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రాలవారీగా కేసుల సంఖ్య
వ్యాధిబారిన పడ్డవారిలో ఇప్పటివరకూ పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. 20 మంది పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరో 171 మందికి వివిధ రాష్ట్రాల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.