పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారితే ఎలాంటి అభ్యంతరం లేదని.. ప్రజాస్వామ్యంలో ఇది అనుమతించదగ్గ చర్యగా పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ రాజ్యసభ వేదికగా.. బలవంతపు ఫిరాయింపు వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.
రమేశ్ వ్యాఖ్యలపై సమీక్షించాలని భాజపా నాయకుడు నీరజ్ శేఖర్ కోరిన నేపథ్యంలో ఈ విషయంపై పరిశీలన చేశారు వెంకయ్య. ఇటీవలే సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు నీరజ్. కాంగ్రెస్ నాయకుడి.. బలవంతపు ఫిరాయింపు వ్యాఖ్యలను ఖండించారు.
"ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోనంత వరకు ఏ వ్యక్తిని నిందించకూడదు. దానిని సానుకూల దృక్పథంతో చూడాలి. సభ్యుడు రాజీనామా చేస్తే అభ్యంతరకరం ఏమీ లేదు. ఇదే సరైన రాజ మార్గం. భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలనుకుంటే.. వారిని నేను అభినందిస్తా."