తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​ రాజకీయం'పై ప్రియాంక కౌంటర్​ ఎటాక్​

జమ్ముకశ్మీర్​ సమస్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కశ్మీర్​లో ప్రజాస్వామ్య హక్కులను హరించడం కన్నా రాజకీయం, దేశ వ్యతిరేకత మరొకటి లేదన్నారు. సమస్యలపై కాంగ్రెస్​ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

'కశ్మీర్​ రాజకీయం'పై ప్రియాంక కౌంటర్​ ఎటాక్​

By

Published : Aug 25, 2019, 1:59 PM IST

Updated : Sep 28, 2019, 5:16 AM IST

'కశ్మీర్​ రాజకీయం'పై ప్రియాంక కౌంటర్​ ఎటాక్​

కశ్మీర్​లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం కన్నా రాజకీయం, దేశ వ్యతిరేకత మరొకటి లేదన్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. జమ్ముకశ్మీర్​ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సమస్యలపై కాంగ్రెస్​ పోరాటం కొ నసాగుతుందని స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్​లో పర్యటించేందుకు వెళ్లిన రాహుల్​ గాంధీతో పాటు అఖిల పక్ష నాయకులను శ్రీనగర్​ విమానాశ్రయంలో అడ్డుకున్న మరుసటి రోజునే ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

శ్రీనగర్​ నుంచి దిల్లీకి అఖిలపక్ష నాయకులు ప్రయాణించిన విమానంలో ఓ మహిళ కశ్మీర్​లోని పరిస్థితులను రాహుల్​ గాంధీకి వివరిస్తున్న వీడియోను ట్యాగ్​ చేస్తూ ట్విట్​ చేశారు ప్రియాంక.

"ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జాతీయవాదం పేరిట అణచివేతకు గురవుతున్న లక్షల మంది​ ప్రజల్లో ఈమె ఒకరు. కశ్మీర్​ సమస్యను విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న వారికి చెప్పేది ఒకటే. కశ్మీర్​లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం కన్నా రాజకీయం, దేశ వ్యతిరేకత మరొకటి లేదు."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

కశ్మీరీల హక్కుల కోసం గళం విప్పాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు ప్రియాంక.

ఇదీ చూడండి: 'ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్​ పార్టీది ఒకే మాట'

Last Updated : Sep 28, 2019, 5:16 AM IST

ABOUT THE AUTHOR

...view details