దేశ రాజధాని దిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యలపై.. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎమ్)పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఈ సమస్యపై తమతో పాటు దిల్లీ ప్రజలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సత్వర చర్యలు చేపట్టి కాలుష్యాన్ని అదుపులోకి తేవాలని కమిషన్కు సూచించింది.
వాయు కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కమిషన్ను ఆదేశించింది న్యాయస్థానం. ఈ విషయమై త్వరలోనే సమగ్ర వివరాలు అందజేస్తామని చెప్పింది సీఏక్యూఎమ్.