దేశవ్యాప్తంగా ఒకే విధమైన పాఠ్యప్రణాళిక అమలు సాధ్యం కాదని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనలో మార్గనిర్దేశం చేయడానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండిలి(ఎన్సీఈఆర్టీ)..జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉందని గుర్తుచేసిన మంత్రి... పాఠ్యప్రణాళికలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రాలు... విద్యా పరిశోధన, శిక్షణా మండళ్ల(ఎన్సీఈఆర్టీ) విధానాన్ని అనుసరించవచ్చని తెలిపారు. లేదంటే జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా సొంత పాఠ్యాంశాలను రూపొందించుకోవచ్చని స్పష్టం చేశారు.