తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంతో గందరగోళం' - రాజకీయంగా సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు

రాజకీయంగా సున్నితమైన అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో మధ్యవర్తిత్వాన్ని పునరుద్ధరించడం.. గందరగోళానికి దారితీస్తుందని విశ్వహిందూ పరిషత్​(వీహెచ్​పీ) అభిప్రాయపడింది. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని హిందూ పక్షాలకు సూచించింది.

'అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంతో గందరగోళం'

By

Published : Oct 19, 2019, 5:30 AM IST

Updated : Oct 19, 2019, 7:59 AM IST

'అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంతో గందరగోళం'

అయోధ్య రామమందిరం కేసుపై విశ్వహిందూ పరిషత్​(వీహెచ్​పీ) స్పందించింది. మధ్యవర్తిత్వాన్ని పునరుద్ధరించడం గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వేచిచూడాలని హిందూ పక్షాలకు సూచించింది వీహెచ్​పీ. మధ్యవర్తిత్వానికి సంబంధించి తమనెవరూ సంప్రదించలేదని వెల్లడించింది.

''అయోధ్య కేసులో సుప్రీం కోర్టు 40 రోజులు, 200 గంటలకుపైగా విచారణ జరిపింది. వాదనలు ముగిశాయి. కేసు తుది దశకు వచ్చిన సమయంలో మధ్యవర్తిత్వాన్ని పునరుద్ధరించడం గందరగోళానికి దారితీస్తుంది.''

- వీహెచ్​పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్​ కుమార్​

సున్నీ వక్ఫ్​ బోర్డు ఈ వ్యవహారంలో సెటిల్​మెంట్​ కోసం ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీహెచ్​పీ ఈ వ్యాఖ్యలు చేసింది.

అయోధ్య కేసు పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని.. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం... అక్టోబర్​ 16న వాదనలు ముగించింది. అదే రోజు సయోధ్య యత్నాలపై కమిటీ.. సుప్రీం కోర్టుకు తమ రెండో నివేదిక అందించింది. నవంబర్​ తొలి వారంలో తీర్పు వెల్లడయ్యే అవకాశముంది.

Last Updated : Oct 19, 2019, 7:59 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details