తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో రెండు నెలల పాటు ఉత్తర భారతం గజగజ! - ఉత్తరాదిన చలి

వచ్చే రెండు నెలల్లో ఉత్తరాదిలో చలితీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య భారతంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వివరించింది.

North India likely to have harsher winter: IMD
'రానున్న రెండు నెలల్లో ఉత్తరాదిన చలి అధికం'

By

Published : Nov 29, 2020, 7:22 PM IST

భారత వాతావరణశాఖ(ఐఎండీ).. డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు చలితీవ్రతపై ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఏడాది శీతాకాలంలో ఉత్తర భారతంలో చలితీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు మధ్య భారతంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిని మించి పడిపోనున్నట్లు పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా రికార్డు కానున్నట్లు అంచనా వేసింది.

అయితే ఇప్పటికే దిల్లీలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నాయి. ప్రజలు చలి గుప్పిట్లో చిక్కుకున్నారు.

ఇదీ చదవండి :ముంచుకొస్తున్న ముప్పు.. 48 గంటల్లో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details