ఉత్తరాదిని వరణుడు వణికిస్తున్నాడు. వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
బిహార్లో 13 జిల్లాలు జలదిగ్బంధం
భారీ వర్షాలకు బిహార్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా 13 జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. మొత్తం 90 లక్షల మందిపై వర్షాల ప్రభావం పడింది. ఇప్పటి వరకు 130 మంది ప్రణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వాహణ విభాగం వెల్లడించింది.
కోలుకోని అసోం...
గత కొన్ని రోజులుగా అసోంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని 12 జిల్లాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మృతుల సంఖ్య 88. మొత్తం 1.6 లక్షల మంది వరదల బారిన పడ్డారు.