భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ).. ఆగస్ట్, సెప్టెంబర్‌లో నమోదయ్యే వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. దీర్ఘ కాలిక సగటతో పోలిస్తే దేశవ్యాప్తంగా కురిసే వర్షపాతం 8 శాతం అటుఇటుగా 100 శాతం ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
2 నెలల పాటు సాధారణ వర్షపాతం: ఐఎమ్‌డీ - భారత్
ఆగస్ట్, సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే ఆగస్ట్‌లో 9 శాతం అటుఇటుగా 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
2 నెలల పాటు సాధారణ వర్షపాతం: ఐఎమ్‌డీ
ఆగస్ట్‌లో 9 శాతం అటుఇటుగా 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రెండవ దఫా నైరుతి రుతుపవనాల్లో వర్ష పాతం 94-106 శాతం (దీర్ఘ కాలిక సగటులో) ఉండనున్నట్లు తెలిపింది.
- ఇదీ చూడండి: జాతీయ గీతం ఆలపిస్తుండగా సొమ్మసిల్లిన గడ్కరీ